శ్రీవిరించీయం

బాధ్యత నిర్వహణ: కర్కశ ప్రవర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రభుత్వోద్యోగం నిర్వహిస్తున్న మనిషి తన బాధ్యత తీర్చుకోవడంలో మామూలు ప్రజానీకంతో కర్కశంగా వుండనక్కరలేదు. సరళంగా, సజావుగా మాట్లాడుతూనే తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఇతరులకూ నియమ నిషేధాలు మనసుకు అర్థం అయ్యేట్లుగా చెప్పవచ్చు’- అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రాసిన కథానిక ‘‘్భరత మహిళా జోహార్’ సరళ జీవనాన్ని గురించి హితోపదేశం చేస్తుంది.
కథానికలో విషయం అతి సామాన్యమయినదే. ఒక పల్లెటూరి మనిషి (్భరత మహిళ) రైల్లో ప్రయాణం చేస్తూ తనతోపాటు ఓ కోడిపెట్టను కూడా తీసుకువెడుతోంది. కోడికి టిక్కెట్ కొనలేదని టిటిఇ ఆమెను అల్లరిపెడతాడు. జులుమానా కింద అయిదు రూపాయలు ఇమ్మని రశీదు పుస్తకం చేతుల్లోకి తీసుకుంటాడు. కాని పాపం, ఆ దమయంతికి (్భరత మహిళ) డబ్బు లేదు, అయిదు రూపాయలు లేవు, ఒక్క రూపాయే వుంది. అది తీసుకుని తనను ఒగ్గేయమని బతిమాలుతుంది. ‘నా కడ ఇయ్యే వున్నాయి. నాను సంకురాత్రిరి పండక్కి గూడాం ఎల్తున్నాను బాబూ. స్టేషన్ కాడికి మా అల్లుడొచ్చేస్తాడు. నన్ను నువ్వొగ్గపోతే నాకు చిన్నతనమవుతుంది. జులమానా విషయమేమిటో నాకెరుక లేదు. ఈ డబ్బుచ్చుగుంతాను. ఇదట్టుకుని నన్నొగ్గెయ్యి బాబూ అని ప్రాధేయపడుతుంది.
‘గూడెంలో పోలీసుల్ని పిలిపించి నిన్ను అరెస్టు చేయిస్తాను. నీ కాళ్లకూ ముక్కులకూ వున్నవన్నీ తీసి తెగనమ్మి వాళ్లు నీ చేత డబ్బు కట్టిస్తారు. తరువాత నీ యిష్టం’ అని టిటిఇ కర్కశంగా అంటాడు. బతిమాలటాలు, యేడుపులు, ప్రాధేయాలు పనికిరాకపోవడంవల్ల దమయంతి ఖిన్నపడుతూ వుండగా, ఆ ఇన్స్‌పెక్టర్ మూడు రూపాయల లంచం ఇస్తే తనను వొదిలేస్తానంటాడు. దాంతో దమయంతికి కొత్త ధైర్యం వచ్చి ‘ఏమిటి బాబూ, ఈ అన్యాయవు, నువ్వడుగుతున్న డబ్బిస్తే ఒగ్గేస్తావు? కాకపోతే బట్టుకుని జైల్లో తోయించేస్తావు. ఇదేటి దాష్టీకవు బాబూ!’ అని ఆక్రోశిస్తుంది. ఇన్స్‌పెక్టర్ జులుమానా డబ్బు పెంచుకుంటూ పోవడంతో దమయంతి అవాక్కయిపోతుంది. ‘నాను కోడికి తిక్కెట్టు తియ్యలేదని గదా నువ్వు జులమానా ఏసినవు? నన్నుసురు పెట్టేసినవు. కోడి నాకపోతే తిక్కట్టు అవసరమేటున్నది’ అని చెప్పి కోడిని బుట్టలోనుంచి బయటకు తీసి వెనక్కూ ముందుకూ రెండుసార్లు ఊపి, గాల్లోకి పైకి ఒక్కసారిగా ఎగురవేసింది- టిటిఇ వెలవెల ముఖంతో వెనక్కు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
కథ ఇంతటితో అయిపోలేదు. గూడెం స్టేషన్ రావటంతోనే బయటకు పరుగు తీయాలని ప్రయత్నించిన ఇన్స్‌పెక్టర్‌ను అడ్డగిస్తుంది దమయంతి. ఆమెను తప్పించుకోవటానికి అతను రెండు రూపాయలు కోడి ఖరీదు కింద ఇవ్వచూస్తాడు. దమయంతి అతని కోటు పట్టుకులాగి ‘నాకు లంచం యిస్తున్నవా బాబూ!’ అని నాలుగు దులుపులూ దులిపి ‘‘ఈ రెండు రూపాయలు నువ్వే వుంచుకో. కోడినొగ్గేసినాను గవర్నమెంటు ఋణం తీర్చేసుకున్నాను గానా’ - ఇక నీ ఋణం నాకెందుకు? ఊ.. ఊ.. వెళ్లు బాబూ ఎల్లెల్లు’’ అని అతన్ని సాగనపుతుంది.
1978లో రాసిన ఈ కథానిక చదువరులకు వర్తమాన రీతి నీతులు, ఔదార్యం యొక్క అవసరం తెలియచెప్పుతాయి. మహిళలలో వివేకం, వివేచన కనపరిచే మచ్చుతునక ఇది.

-శ్రీవిరించి