క్రీడాభూమి

ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌లో శ్రీకాంత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలాంగ్, డిసెంబర్ 6: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా మాస్టిర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. స్థానిక ఆటగాడు టామీ సుగియార్తోతో పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడిన శ్రీకాంత్ గట్టిపోటీనిచ్చాడు. అయితే, సుగియార్తో కూడా అదే స్థాయిలో ఎదురునిలిచి, చివరికి శ్రీకాంత్‌పై 17-21, 21-13, 24-22 తేడాతో విజయం సాధించాడు. మొదటి నుంచి చివరి వరకూ ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను హి బింజియావో కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె చెన్ యుఫెయ్‌పై 21-18, 21-9 తేడాతో సులభంగా గెలిచింది. మహిళల డబుల్స్‌లో టాంగ్ యువాంగ్‌టింగ్, యూ యాంగ్ జోడీ 21-17, 21-11 స్కోరుతో నత్య కిషింద మహేశ్వరి, గ్రేసియా పొలీ జోడీపై విజయం సాధించి టైటిల్ అందుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను బెర్రీ అగ్రియవాన్, ర్యాన్ అగుంగ్ సపుత్రా జోడీ కైవసం చేసుకుంది. వీరు ఫైనల్‌లో చెయ్ బియావో, హాంగ్ వెయ్ జోడీని 21-11, 22-20 తేడాతో ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో టాన్ టవని అహ్మద్, లిలియానా నాట్సిర్ 21-18, 21-13 తేడాతో డ్రవిన్ జోర్డాన్, డెర్బీ సుశాంతో జోడీపై విజయం సాధించారు.