శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. భువిని కావ్యరస సుధానుభవము కన్న
వ్యాకరణ శాస్త్ర పాండితీ పటిమ కన్న
బర్హి పింఛమ్ము శిరముపై వరలు చుండ
కంఠమున పూసల సరులు కదులుచుండ
భువన మోహనంబు గ వేణువు పలికించు
నందనందను ధ్యానమానందమొసగు
భావం:కావ్యాలను చదివితే వచ్చే ఆనందం కాన్న వ్యాకరణ శాస్త్ర లోతుల్ని తరచి చూస్తే వచ్చే సంతోషం కన్నా నెమలి ఫింఛం తలపై మెరుస్తుండగా కేవలం పూసల దండలను మెడలో ధరించి భువన మోహనంగా వేణునాదాన్ని వినిపించే వేణుగోపాలుని దివ్య రూప ధ్యానమే బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. (శ్రీ యాదవేంద్రపురి)

తే.గీ. చిన్ని కృష్ణుని దివ్యవౌ చెలువు చెలువు
కంసవైరిని గాంచెడు కలిమి కలిమి
భునవమోహనుని మదురాపురము పురము
భక్తసులభుని భావించు భక్తి భక్తి
భావం: మోహనాంగుడైన చిన్ని కృష్ణుని అందమే అందం. కంసాంతకుడైన శ్రీకృష్ణుని చూసే అదృష్టమే అదృష్టం. కృష్ణుడు నెలకొన్న మధురాగనగరమే నగరం. భక్తసులభుడైన వేణుగోపాలుని ధ్యానించే భక్తియే భక్తి.
(శ్రీరఘుపతి ఉపాధ్యాయ)

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949