శ్రీ కృష్ణామృతం

లీలామానుష వేషధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సు సాగితే మానవ పంచేద్రియ ప్రవృత్తిమార్గం సుదీర్ఘం
మనస్సు ఆగితే మాధవునిపై భక్తితో నివృత్తి మార్గం జీవన్ముక్తి సుసాధ్యం.
మనస్సు మానం పాటిస్తే ఇంద్రియ నియంత్రణ బహు సులభమార్గం
మనస్సు లేకపోతే మాట లెక్కడివి? మోక్షమొక్కటే తప్ప

సంసారసాగరంలో సంకల్ప మత్స్య కదలికల కల్లోలం
దేహానికి మందిరం మానవ హృదయాంత రంగం
గుండె గుహ గర్భ గుదిగూటిలోనే గోవిందుడికి స్థానం
క్షేత్రములు అనంత న్యాస్త దేహ అంతర్యామి క్షేత్రజ్ఞుని అక్షరస్థావరములు

పగలును మ్రింగేందుకే రాత్రి సిద్ధం చీకటిని తరిమేందుకే పగటి ప్రయత్నం
జ్ఞానం వెలుగు జిలుగులకు అసలే లేదు అస్థమయం
తేజస్సును హరించేందుకు తమస్సుకు అసాధ్యం
శ్రీకృష్ణ జ్ఞానామృత అభ్యంజన స్నానం చేస్తే ఆనందమేగాని అజ్ఞానం శూన్యం

ఆరోగ్యానికి ఆస్పత్రిలో చేరడం అత్యవసరం
అనుగ్రహం పొందుటే పరమభక్తుని ఆశయం
ఆత్మస్వస్సరూప జ్ఞాన ధ్యేయం సచ్చిదానంద అనుభవం
ధర్మాచరణే ధర్మ రూపములో ఉన్న ప్రత్యక్ష దైవ స్వరూపం

ఆవేదన వల్ల రోదన రోదన వల్ల పరమాత్ముని కొరకు శోధనం
సాధనతో దేహభరింతుల నాశనం ఆవేదనల అదృశ్యం
వెచ్చని శ్వాసల బుసలలో అరిషడ్వర్గ తాపముల ఆవేశం
మేరు దండంతో ప్రవహించు ప్రకాశం వెన్నల చల్లని జల్లుల ఆహ్లాదం

మనోవృత్తుల దృశ్య ప్రపంచం అసత్యం ప్రాతిభాసికం
ద్రష్ట దృక్కు దృశ్యములు కలలు కల్లలు సంకులకంటకముల ఆటంకములు
అన్నీ మారి మాని, మాడి, పాడై పాడై పోయేటివి భ్రాంతి జనిత మహామాయలు
ఉన్నది పోదు పోయినదిరాదు ఉన్నట్లున్నది పోతుంది ఉన్నదొక్కటే ఉపేంద్రుడనుకో

నాలుకపై నారాయణ నామం నాట్యమాడితే నాకప్రాప్తి నిశ్చయం
భవబంధముల భ్రాంతులు తొలగితే భగవంతుని దర్శనం లభ్యం
దారువుతో చేసిన ద్వారకా నగర ద్వారములు దయతో తెరుచుకొంటే దామోదరుని దర్శనం
పరమాత్ముడు క్రిందికి దిగితే అవతారం పైకిపోతే అంతర్థానం ఇదే అంతరార్థం

రోదిస్తే రోదసీదాటి అంతరిక్షంల అనంతుడి పాదాబ్జముల నందుకొన జాలం
వాడేసుకున్నా మృత్యువు కాటేయకమానదు కాయము కాటిలో కాలుటకే ధర్మం
కాలరూప యముని భగిని యమున కట్టలేదు ప్రాణ రక్షాబంధనం
శ్రీకరుని హస్తమస్తక సంయోగం కాదు దహనం పాద పద్మాల స్మరణం యోగి హృద్యానగమ్యం

- ఆర్. లక్ష్మణమూర్తి 7207074899