శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అర్హతలుగల్లు వారి ననర్హులుగానుఁ
బరిగణించియుఁ బ్రతిభనుఁ బాతి పెడుదు
రర్హతే లేనివారికి యందలమ్ము
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!

భావం: నేటికాలంలో ఎనె్నన్నో అర్హతలు పొందిన వారిని అనర్హులుగా లెక్కిస్తున్నారు. అనంతమైన ప్రతిభా సంపత్తిని పాతరేస్తున్నారు. ఏ విధమైన అర్హతలు లేని అల్పులకు పల్లకీలు సిద్ధం చేస్తున్నారు. ఇలా అయితే దేశభవిష్యత్తును ప్రశ్నించుకునే దుస్థితి కలుగుతుంది కదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ చూడవయ్య.
తే.గీ. పాలు విరిగి కీడను భావనపుడు
పగులఁ గొట్టు దురీనాడు పనియుఁ గట్టు
కునియు పన్నీరు పేరున ఁ గువలయాన ఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: పూర్వకాలంలో పాలు విరిగి పోతే అది కీడును సంకేతంగా భావించేవారు. ఇటీవల కాలంలో చిక్కటి పాలను పన్నీరు పేరుతో విరగగొట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారంటే ఎంత విడ్డూరం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ నీవైనా చూడవయ్య.