శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తలుపఁదడిగుడ్డతో గొంతు తరుగువారు
కారముంగండ్ల ఁ గొట్టెడి వారుగలరు
వారిబారిన నెందరో పడుచునుండెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ మాయాజగత్తులో తడిగుడ్డతో గొంతు కోసేవారే కాదు, కళ్లల్లో కారం కొట్టేవారు కూడా ఎక్కువే. కనురెప్ప కదలికల్లోనే మోసాలు చేసే ఘరానా దొంగలు బయలుదేరుతున్నారు. అలాంటి వారి బారిన అమాయకులు ఎందరో పడి అన్యాయమయిపోతున్నారు. దీనికీ కారణం ఆశనే కదా. ఆశను కాస్తంతైనా ఆవలకునెట్టే వారే కనిపించకుండా పోతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా చూడవయ్య.
తే.గీ. మూల దాచిన మూటల ముడుల విప్పి
పంచిబెట్టుచు సంతృప్తిఁ బడదె ధనిక
వర్గమదియు మేల్కొనురోజు వచ్చునెపుడొ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ లోకంలో కోట్లకు పడగలెత్తినవారు లేకపోలేదు. అటువంటి ధనికవర్గం వారు తమ వద్ద మురిగిపోతున్న ధనాన్ని ఆనందంగా పేదలకు పంచిపెడుతూ తద్వారా కలిగే సంతృప్తిని పొందరు. తరతరాలకు తరగని ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించాలనే యావ, పిసినారి తనం ఉన్నవారు ఎక్కువఉన్న ఈలోకంలో ఉన్నవాడి సొత్తుకూ పేదవాడి ఆకలికీ సంబంధ మేర్పడేలా అట్టివారు మేల్కొనే రోజెప్పుడొస్తుందో కదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262