శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అధిక సంఖ్యాకులరయంగ నాదివార
పునియమాలను ఁ బాటింపఁ బోరెయేరి
కోరి కొని ఁ దెచ్చుకుందురే కోటి కష్ట
ములను తర్కంబుఁ జేతురే మూర్ఖముగను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈరోజుల్లో చాలామంది ఆదివార నియమాలను ఏ మాత్రం పాటించకుండా అనేకానేక కష్టాలను ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు. తెలిసిన వారు ఆదివార నియమాలను తప్పక పాటించాలని చెప్పినా మూర్ఖపువాదాలు చేస్తూకాలయాపన చేస్తారు. కానీ అసలు విషయాన్ని మాత్రం పట్టించుకొనరు. ఈ మనుష్యుల నైజం చూడుమో కర్మసాక్షి. ఓ సూర్యదేవ!
తే.గీ. గంజినీళ్లొక వంకను కలియఁ జూడ
బంచభక్ష్యాలు పరమాన్న పాయసాలుఁ
జక్కగానొక వంకను సాటివారి
నాదరించని దుస్థితి కంతమేది?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:ఒక ప్రక్క గంజినీళ్లతో కడుపు నింపుకునే వారున్నారు. మరో ప్రక్క పంచభక్ష్య పరమాన్నపాయసాలతో కడుపునింపుకునే వారు ఈ లోకంలో ఉన్నారు. ఉన్నవారు లేనివారిని ఆదిరించాలని అనుకోకపోవడం వల్లనే నేటి దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి బయటపడాలనే ఆలోచన్లు ఏమాత్రం చేయడంలేదు నీవైనా చూడవయ్య కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262