శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాని కూడని పనులతో ఁగాలయాప
నంబుఁ జేసెడి వారు లోకంబునందుఁ
బెచ్చు పెరుగుచునున్నారు వేయి కనులఁ
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: కాని పనులు, కూడని పనులతో కాలక్షేపం చేసేస్తున్నవారు ఈ లోకంలో పెచ్చుపెరిగి పోతున్నారు. చేయాల్సిన సత్కార్యాలను త్యజించి దుష్కర్మలను ఆచరించే పాపులకు ఎంత చెప్పినా వారి మనస్సులోకి ఎక్కడం లేదు. మరి వారి ఆలోచన్లను మార్చే ఉపాయం తెలియడంలేదు. వారంతా ధర్మమార్గంలో వచ్చేట్టుగా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఓ కంటి కనిపెడుతుండవయ్య ప్రభూ!
తే.గీ. మాటయే మహామంత్రంబు మాటయాచి
తూచి యుంబల్క మేలని యెంచఁ బోక
నిచ్చ వచ్చినటులఁ బల్క నేర్చిరకట!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మాటే మహామంత్రం. చల్లనైన, తీయనైన ప్రీతికరమైన మాటను మించిన మహామంత్రం ఏముంటుంది కనుక? కాబట్టి మనమేమి మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. అంటే ఎదుటివారు ఏ విధంగా మాట్లాడుతున్నారో వారి మాటలను బట్టి వారి మనసును తెలుసుకొనే వీలున్నది కనుక ఆలోచించి మాట్లాడగలగాలి. కానీ కొందరు తమ ఇష్టమొచ్చినట్లు ప్రేలాపనలు ప్రేలుతుంటారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా చూడవయ్య ప్రభూ!