శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. క్రమము దప్పియు జీవిత కాలమందు
తెగిన గాలిపటము వోలెఁ దిరుగ నేల?
ప్రతినిమేషము నుపయోగ పరచు కొనరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జీవిత కాలంలో క్రమశిక్షణా రాహిత్యంలో తెగిన గాలిపటంలా ఇష్టం వచ్చినట్లు తిరగడం దేనికి? జీవితంలో ప్రతి నిమిషాన్ని ప్రయోజన్మాకంగా మలుచుకుని జీవిత సాఫల్యాన్ని పాందాల్సిన అవసరం ఉంది. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! అంతా క్రమశిక్షణ పాటించేలా నువ్వు అనుగ్రహించవయ్య ఓ సూర్యప్రభూ!
తే.గీ. మనమునందున్న రిపులను మట్టుబెట్టి
దివ్యతేజాన మనుజులు దేజరిల్ల
వలయునే! వారి మాయాలోఁబడిని రీతిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం:- కామక్రోధలోభమోహమద మాత్సర్యాలనే అంతశ్శత్రువులను సమూలంగా నాశనం చేసి మనుషులంతా దివ్యదదేజస్సును కలిగియుండాలి. ఆ అంతశ్శత్రువులు మాయలో పడని విధంగామనుషులందరిన కర్మసాక్షి వైన సూర్యదే ఓ సూర్యదేవ కాపాడుము.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262