శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. విమల సుందర నయనార విందయుగము
గల్గు శతకోటి మన్మథాకారుడవగు
సరసబృందావనారామ చక్రవర్తి
నీదు రూపమ్ము హృద్వీధినిలచుగాక !
భావం: బృందావన సార్వభౌముడవగు ఓ రాధా మనోనాయకా! సుందరమైన నేత్ర యుగంతో శతకోటి మన్మథాకరుడవై భాసించే నీ దివ్య మంగళ విగ్రహం నా మనో వీధిలో నిలిచి యుండుగాక ( శీభవానంద)
తే.గీ. మహిత కవిసార్వ భౌమ త్వముడుగబోను
అతుల సౌందర్య రాశుల నడుగబోను
అనుచరుల కోట్ల సంఖ్యలో నడుగబోను
గాని, నీపాదయుగముపై క్రమభక్తి
అన్ని జన్మాల కలుగంగ నంజలింతు
*
భావం: కృష్ణా! కవి సార్వ భౌమత్వాన్నీ కోరుకోను. సాటిలేని సౌందర్యరాశఉల నిమ్మనీ అడుగబోను. కోట్లాది అనుచరుల నిమ్మనీ అడుగను గానీ నీపాదపద్మాలపై నిశ్చల భక్తి అన్ని జన్మాలలోను కలిగేట్లుగా నన్ను అనుగ్రహించు (శ్రీ చైతన్య మహాప్రభువు)

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949