శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చదివితిని సమాజము నంతఁ జక్కగాను
లోపములు సవరింప నాలోచనొకటి
మదిన మెదలంగ శతకమై యెదలు దట్టెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణ మూర్తీ ! శ్రద్ధాసక్తులతో మన చుట్టూతా ఉన్న సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి, నేటి సమాజంలోని లోపాలను సవరించాలనే ఆలోచనొకటి మదిలో మెదలడమే తడవుగా శతకంగా రూపుదిద్దుకుంది. ఈ శతకం ఎంతో మంది పాఠకుల హృదయాలను తాకటం నీవు నాపై కురిపించిన దయామృతంగా అది నా అదృష్ట్భాగ్యంగా భావిస్తున్నాను.
తే.గీ. నేను శతకానఁ జక్కంగ నిత్యసత్య
ములనుఁదెల్పితి నాశక్తి కొలది సూర్య
దేవుని మదిన నిల్పియుఁ దేజమరల
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణమూర్తీ! ఈ సూర్యశతకంలో చక్కగా నిత్యసత్యాలను నిన్ను మదిలో ప్రతిష్టించుకుని నా శక్తికొలది ప్రకాశించే విధంగా తెలియబరిచినాను. నీ దయ వల్ల పాఠకాలి హృదయంలో పరివర్తనం జరిగి మంచితనమూ మానవత్వం నిండిన మనుషులుగా మారుతారని నాప్రగాఢ విశ్వాసం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! మమ్ములం దరినీ దయచూపే లోకప్రభువు నీవే సుమా.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262