శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వింత రోగాలు మందులు వేనవేలు
వైద్యశాలల రోగుల బారులకట !
భాగ్యహీనులు క్షేమంబుఁ బడయు నటులఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: లోకంలో ఎక్కడ చూసినా వేలాది వింత వింత రోగాలతో దుర్భరమైన బాధలను అనుభవిస్తూ అనేకమైన మందులు మ్రింగుతూ వైద్యశాలల్లో రోగులు బారులు తీరి స్వస్థత కోసం ఆశగా నిరీక్షిస్తున్నారే.వారందరూ పూర్వజన్మకర్మమో లేక నేటి అజ్ఞానం వల్లనో రోగాల బారిన పడినామని వేదన చెందుతున్నారు. అటువంటి భాగ్యహీనులంతా ఆయురారోగ్యాదులను పొందేలా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ అనుగ్రహించు ప్రభూ!
తే.గీ. పడరు శారీరక శ్రమ ఫలితమెన్న
స్థూల కాయాలు గొప్పలు చూడరోగ
భూతములు పట్టి పీడింప భోరుమనరె!
చూడుమా కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: శరీరాన్ని మనం కష్టపెడితే ఆ శరీరం మనల్ని సుఖపెడుతుంది. శారీరకశ్రమ చెందకుండా శరీరాన్ని భోగభాగ్యాలలో ముంచి తేల్చితే ఆ శరీరం మనల్ని ఎంతగానో కష్టపెడుతుంది. ఆధునిక కాలంలో విద్యుత్ నడిచే వస్తు సముదాయాన్ని ఉపయోగించడానికి అలవాటు పడిపోయి ఏ మాత్రం శరీరానికి శ్రమ కల్గించడం లేదు. తత్ఫలితంగా వూబకాయాలతోటి, రోగాలతోటి, వివిధ రకాలైన నొప్పుల తోటి ప్రజానీకం విలవిల్లాడిపోతున్నది. వీరిని ఒక్కసారైనా చూడవయ్య ప్రభూ! కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262