శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అద్దెయిండ్లలో బ్రతుకుల దిద్దుకొనుచు
లాగుచుంబీకుచెన్నియో వేగువారు
పిల్లి తన పిల్లలను మార్చువిధము దోచెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చాలాకాలం నుంచి అద్దె ఇళ్లల్లో జాగ్రత్తగా బ్రతుకులు చక్కదిద్దుకుంటూ వేర్వేరు సందర్భాలలో ఇళ్లు మార్చవలసి వచ్చినపుడల్లా తాము అమర్చుకున్న వేవేవో లాగుతూ పీకుతూ దుర్భరమైన వేదనలకు గురువతున్నారెందరో. అలాంటి అద్దెఇళ్లల్లో నివాసమున్నవారు సంపూర్ణ స్వేచ్ఛకు నోచుకోవడం లేదు. వారు పిల్లి తన పిల్లల్ని మార్చినట్లు వీరు ఇళ్లను మార్చి మార్చి జీవనం సాగిస్తున్నారు. వారి సొంతింటి కలను నిజం చేయవయ్య సూర్యదేవ!
తే.గీ. మాయమాటలు మోసాలు మరల మరలఁ
జేయు తప్పులు కోతలఁ గోయుటెదుటి
వారిఁ జులకన ఁ జేయుట వంటి వెన్ని
యెన్నియో లోకమందున నెన్న ఁ దరమె!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: నేటికాలంలో ఏవేవో మాయ మాటలు చెబుతుండడం, మోసాలు చేస్తుండడం, చేసిన తప్పులే తెలిసి కూడా మరల మరలా చేయడం , కోతలు కోస్తుండడం, ఎదుటివారి ఔన్నత్యాన్ని గుర్తించక వారిని తూలనాడటం వంటివి పెరిగిపోతున్నాయి. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! అలాంటి వారినో కంట కనిపెడుతూ వాళ్లల్లో పరివర్తన కలిగేలా చూడవయ్య లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262