శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కూడ రావేవి సొమ్ములు గూలు వేళఁ
దోడు రారెవ్వరవ్వేళ ఁ దొలగిపోవుఁ
బాపపుణ్యాలు మాత్రమే వచ్చుననియుఁ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మరణ సమయంలో మనం కూడగట్టుకున్న సొమ్ములేవీ కూడా రావే! ఆ సమయంలో బంధుమిత్రులంతా వెడలిపోయేవాళ్లే. మరణానంతరం మనతో పాటు వచ్చేవి మనం చేసుకున్న పాపపుణ్యాలే అనే విషయం తెలుసుకోకుండా అకృత్యాలకు, అఘాయిత్యాలకు పూనుకుని పాపం మాత్రమే మూటగట్టుకునే వారికి కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! జ్ఞానోదయం కలిగించవయ్య ! లోకప్రభూ!
తే.గీ. నేను నాదను భావనయేల? హృదినఁ
దొలగి పోనివ్వలేల? లోకులు గనంగ
మేము మాదనుకున్నచో మేల్వడుదురు
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!

భావం: నేను నాది అనే భావన దేనికో? ఆ భావన మనస్సు నుండి తొలగించుకోలేక పోతున్నారెందుకో? మేము మాదనే భావన కల్గియున్న పక్షంలో అంతా మేలే జరుగునుకదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!నేను, నాదనుకునే వారి కనులు తెరిపించి వాస్తవాన్ని వారికి చూపించవయ్య లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262