శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మనము కారణ జన్ములమని యెఱింగి
మసలుకొనరేల మనుజులు మహిన తమను
తామెఱుగరాయె ఁ జేతురే తప్పిదములు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: భగవంతుడు ఏ యొక్కరినీ అకారణంగా పుట్టించలేదు. అందరికీ అందరూ కారణజన్ములే. చాలామంది ఈ విషయాన్ని గుర్తించరు. సరికదా అసలు తామేమిటో తమ విధులేమిటో తెలుసుకోకుండానే లెక్కకు మిక్కిలి తప్పులు చేసేస్తుంటారు. అలాంటివాళ్ల కళ్లు తెరిపించగల వాడవు కర్మసాక్షియైన నీవేనయ్య, సూర్యదేవా!
తే.గీ. కదిలిరాదాస్తి యంత్యాన కదిలిరారు
మృత్యుకోరలో ఁ జిక్కిన మిగుల దేవి
యావన్నయిన్న జీవితంబన్నఁ గాంచ
బుద్బుదములంచు ఁ దెలుసుకోబోరె సుంత
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అంత్యకాలంలో ఆస్తిపాస్తులు గానీ, బంధుమిత్రులు గానీ ఏవీ తోడురావు. సరికదా ఎవ్వరూ తోడురారు. వనం అన్నా జీవితవన్నా ఆలోచిస్తే రెండూ నీటి బుడగలే కదా. ఈ విషయాన్ని గుర్తించిన ఎందరో మహానుభావులు లోకకల్యాణార్థమే పనులు చేస్తున్నారు. వారిని చూసైనా తెలుసుకోలేక ఎందుకో ఆరాటాలు, పోరాటాలు. ఈ మనుజులకు జీవిత సత్యాన్ని ఎరుక చేయుము ప్రభూ కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262