శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తన విషయములు గుట్టుగ దాచి యుంచి
కూపి లాగుదురితరుల నోపఁ బోరు
వారి దరిఁ జేరు వారి ఁ గాపాడు మర్క
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ కాలంలో చాలామంది తమకు సంబంధించిన వివిధ విషయాలను గోప్యంగా దాచిపెడుతుంటారు. కానీ ఇతరులకు సంబంధించిన వెన్నో చాకచక్యంగా కూపీలాగుతూ తెలుసుకుంటుంటారు. మంచితనం మూర్త్భీవించిన ఇతరులు దాపరికం అనేది లేకుండా అటువంటి వారిదగ్గరనే ఎక్కువగా చేరుతూ ఆ తర్వాత నొచ్చుకుంటుంటారు అలాంటి వాళ్లను కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవే కాపాడాలి.
తే.గీ. ముందొక విధముఁ బల్కుదురెందుఁ జూడ
వెనుకొక విధముఁ బల్కుదురనవరతము
ముక్కు సూటితనము వారి నెక్కడైన
నావగింజంత మెచ్చరే నాడు గూడఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ రోజుల్లో చాలామంది ఎల్లప్పుడూ ముందొక విధంగా వెనుక ఒక విధంగా మాట్లాడుతుంటారు. కొంతమంది మాత్రం ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. యథార్థవాది లోక విరోధి అన్నది ఆర్యోక్తి కదా. కుత్సితుల కుత్సితత్వాన్ని బయట పెడుతూ యథార్థ వాదుల ఔన్నత్యాన్ని అంతా గుర్తించేలా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవే పూనుకోవాలి భాస్కరా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262