శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ పెద్దలున్నట్టి వేళలో వినయమతిగఁ
జూపి లేనట్టివేళలో ఁ జూడ ఁ గొంద
రెచ్చటిచటికో పోదురే! విచ్చల విడి
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ కాలంలో ఉపాధి కల్పించిన పెద్దల సమక్షంలో వినయ విధేయతలు ఒలకబోస్తూ, స్వామి భక్తి కరువై జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా న్యాయం చేయాలని లేశమాత్రం ఆలోచించకుండా ఆ పెద్దలు లేని సమయంలో విచ్చలవిడిగా ఎక్కడెక్కడో తిరుగుతున్నవాళ్లు అసంఖ్యాకంగా ఉన్నారు. అలాంటి వాళ్లల్లో మార్పు తీసుకురావడంతో పాటు తమ వద్ద పనిచేస్తున్న వాళ్ల ప్రవర్తనాతీరు ఆ పెద్దలు గ్రహించేలాచూడుము సూర్యదేవ!
తే.గీ. బ్రతుకుటకు దార్ల వెన్నియో పరచుకొనియె
ముఖ్యమదికాదు సత్కార్యములనుఁ జేయ
వలయు లేనిచో యేల రుూ బ్రతుకు? వలదు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలో బ్రతకడానికి సవాలక్షదార్లున్నాయి. అలా బ్రతకడం ముఖ్యం కాదు కదా. ఉదాత్తమైన మానవ జన్మలభించినందుకు గాను ఎనె్నన్నో సత్కార్యాలను చేసి జన్మసార్థకం చేసుకోవాలి. లేనిచో ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం నయం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ బ్రతుకు సార్థకతను తెలియజేయవయ్య స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262