శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పెండ్లి కాగానె పెండ్లాము బెల్లమగుచుఁ
దల్లిదండ్రులు చేదగుఁ దలువనేడు
వారలిచ్చిన జన్మ సఫలత నొంద
కున్న పురుగులేయెన్నంగ మిన్న సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈరోజుల్లో పెళ్లయిందంటే చాలు పెళ్లాన్ని అమితంగా ఇష్టపడుతూ కనిపెంచిన తల్లిదండ్రులను చేదుగా భావించే పుత్రరత్నాలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోకుండా వారిని నిర్లక్ష్యం చేస్తున్న తనయులకంటే చీడపురుగులే మిన్న కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! అలాంటి వాళ్లకి జ్ఞానోదయం కల్గించే కిరణాలను ప్రసరింపచేయుమా ప్రభూ!
తే.గీ. మంచి మనసున్న మనుషులు మారుమూల
చెడ్డవారలె తారసపడ్డవారు
చెడుగుఁ దొలగించుకున్నచోఁ జిత్రరీతి
మంచివారయి ప్రత్యక్షమవరెవారు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మంచి మనసుగల మనుషులు నూటికో కోటికో ఏ ఒక్కరో ఏ మూలో దాగియుంటారు. తెల్లవారితే చాలు మనకంతా కాస్తో, కూస్తో చెడుతనం ఉన్నవారే తారసపడుతుంటారు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడును అణగదొక్కి మంచిని పైకి తీసుకొని వస్తుంటే వారే మంచివారుగా కీర్తికెక్కుతారుకదా. చెడు ఆలోచనలను తొలగించుకునే శక్తిని వారికిప్రసాదించుమా కర్మసాక్షివైన ఓ సూర్యప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262