శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. లబ్ధిఁ బొందంగ వలెనని లాంచినంత
నింపుకుంటిరి యదికాస్త నీటమునిగి
తిరిగి రానట్టి లోకాలకరిగిపోతి
రేమి యానమ్ము మరణాలకేమి కొరత?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అధిక ధనాపేక్షతో లాంచి నిండా జనాలను నింపుకున్నారు. తత్ఫలితంగా అది కాస్తా నీట మునిగిపోయిందే! ఎంతోమంది ఊహాతీతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇదేమయినా సుఖవంతమైన ప్రయాణమా? అకాలమరణాలతో మిగిలినది శోకముద్రలే! కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య స్వామీ!
తే.గీ. సుడులు దిరిగిన గోదారి వడిని ఁగాంచి
హద్దుమీరిన సాహసయాత్ర ఁబూని
సోకసంద్రంపు లోతులఁ దాకినారె!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: వరద గోదావరి నురుగులతో పరుగులతో సుడులు తిరుగుతూ ఉప్పొంగి ఉరుకుతున్న సందర్భంలో అత్యంత సాహసోపేతమైన యాత్రకు పూనుకున్నందుకు ఫలితం విషాదమా? దుఃఖసాగరపు లోతులను తాకుటే పరమావధి అయింది కదా అయ్యో! కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ప్రాణాలకు ఖరీదుకట్టలేమని ప్రబోధించమయ్యా స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262