శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చిన్ని వర్తకులనుఁ జేరి చెడ్డబేర
మాడి పోదుదుకొసరుచుఁజూడఁ బెద్ద
వారలు స్టారు హోటళ్లఁ బడి మరలుచు
టిప్పులను వేతురే రాచఠీవి తోడఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చిన్ని చిన్ని వర్తకుల వద్ద కొసరుతూ పొసగని బేరమాడి పోతుంటారు సంపన్నులు ఐదో పదో వాళ్లడిగినవి కొసరకుండా ఇస్తే వాళ్ల్ల కళ్లల్లో ఆనందం చూడవచ్చు. కానీ, ఆ పెద్దలే స్టారు హోటళ్లకు పోయి వేలాది రూపాయలు ఖర్చుపెడుతూ తిరిగి వచ్చేటపుడు వాళ్లు అడగకపోయినా సరే రాచఠీవితో చేతికొచ్చినంత పైకం టిప్పు అంటూ వేసేస్తుంటారు. ఎంత ఘోరం ఇది? కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైన కాస్త చూడవయ్య లోకప్రభూ!

తే.గీ. మానవత్వమె మతతత్త్వమని యెఱింగి
మసుకొనఁ బోరలేల రుూ మనుజ జన్మ
కొక్క చక్కని యర్థమ్ము గూర్పరేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: సర్వమతాల సారం మానవత్వాన్ని కలిగి యుండడమే. ఈ సత్యాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఉదాత్తమైన ఈ మానవ జన్మకు అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చుకోరెందుకో? మనిషి మనీషిగా మానవతాదృక్పథంతో అడుగులు వేగవంతంగా వేసేలా చూడవయ్య కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262