శ్రీకృష్ణ లీలారింఛోళి

జాతిపిత గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సత్యాగ్రహాలతో శాంతి చిహ్నాలతో
నేతృత్వముం బూని నిలచినాడు
తన చేతి కఱ్ఱతో ఁ దరిమికొట్టెను గదా
తెల్లవారిని వారి దేశమునకు
బానిసత్వమునందు బహువిధంబుల వేగు
భారతీయుల కాత్మబలమతండు
ఒక చెంపపె ఁ గొట్ట నొక చెంపయే గాక
మరు చెంపపై ఁ గొట్టు మనునతండు
చీకటుల్ ఛేదింప ఁ జేత గీతను లట్టి
శిరమెత్తి నిలిచిన శిఖర మతడు
స్వాతంత్య్ర కాంక్షను భారతీయులలోనఁ
బూర్ణమ్ముగా నింపు పూజ్యుడతడు

గీ. ఆ ‘మహాత్ముడు’ మన ‘గాంధి’ యగ్రనేత
‘జాతి పిత’ గ బానిస జాతికంత
మక్తి నొసగిన ధీశాలి శక్తియుతుడు
మానవాతీత శక్తికి మారుపేరు

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262