శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. గీ. పట్టమన్నది ప్రతిభకుఁ గట్టఁబోరు
మంచివానికి స్థానమ్ము నుంచఁబోరు
కలిమిఁగలవాడె ఘనుడు లోకంపుతీరుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటి సమాజంలో వివిధ రంగాలలో ప్రతిభావంతులెందరో ఉన్నారు. కానీ ఏ కొద్దిమందినో తప్ప చాలామంది ప్రతిభావంతుల ప్రతిభకు గుర్తింపు లభించడంలేదు. మంచితనముగల మహనీయులకు ఉచిత స్థానాలను కల్పించడం లేదు. సంపదగలవాడే నేటి సమాజంలో గొప్పవాడుగా పరిగణించ బడుతున్నాడు. మెరిసేదంతా బంగారమనుకొంటే అది ఎక్కువనాళ్లు ఉండదు కదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనాఈ సంగతి చెప్పుమా ప్రభూ!
తే. గీ. విషపు నవ్వులు పలుకులు వికృతంపు
చేష్టలవినీతి యోచనల్ సిగ్గుమాలి
నట్టి కృత్యంబులవనినిఁ బట్టి కుదిపెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎక్కడ చూసినా విషపూరితాలైన తెచ్చుకోలు నవ్వులు, విషపూరితాలైన మాటలు, వికృత చేష్టలు, అవినీతితో కూడిన ఆలోచనలు మరియు సిగ్గుమాలిన పనులు ఈ భూమండలాని అదిమిపట్టి మరీ కుదివేస్తున్నాయి. దీనివల్ల మంచివారికి ఎంత కీడు కలుగుతోందో చెప్పలేకున్నాము. ఈ ధోరణి విడువకపోతే ఆయా మాటలు మాట్లాడేవారికీ కీడుకలుగక మానదని కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా!తెలియచేయుమయ్య ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262