శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాదు కంటికిఁ గన్పట్టఁ గండ్లగాన
రావు గర్వోన్నతం బొందరే విచిత్ర
మట్టి కాసులు గాటికి ఁ గదలిరావు
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: లక్ష్మీ ప్రసన్నం అయిందంటే చాలు కళ్లుమూసుకుపోతాయి. ఎంతో గర్వాన్ని కూడా కూడగట్టుకుంటారు. డబ్బుంటే చాలు ఇంకేమీ అవసరం లేదనుకొంటారు అజ్ఞానులు. ఎంత విచిత్రం! పోయినపుడు తాము ఎంతో కష్టపడి సంపాదించిన వాటిలో ఏ కొన్నయినా కాటిదాకా వస్తాయా? కర్మసాక్షివైన ఓసూర్యదేవా!్ధనమే జీవిత పరమావధి కాకూడదని తెలియ జెప్పుమయ్య.
తే.గీ. సంతసంబునఁ బొంగుదురింత దుఃఖ
మందునం గృంగిపోదురే మనసునందు
నెఱపరే! సమదృష్టియు నెఱుగుఁ బోరు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: చాలామంది ఆనందంతో పొంగిపోతుంటారు. అలాగే కష్టం కలిగినపుడు తీవ్ర మనస్తాపంతో, సంతాపంలో, దుఃఖంలో మునిగి కృంగిపోతుంటారు. సుఖదుఃఖాలు రెంటినీ సమదృష్టితో చూస్తూ స్థిరచిత్తాన్ని కల్గియుండడం లేరే! కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! సుఖదుఃఖాలందు స్థిరచిత్తాన్ని కల్గియుండాలని ఈ లోకానికి చాటి చెప్పువయ్య స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262