శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తీపి మాటలు కరువాయె దేహులందుఁ
కష్టములఁ బడువారిని ఁ గాంచి కంటఁ
దడియుఁ మెట్టరె యోదార్పఁ దరలిరారు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటి సమాజంలో ప్రీతి పూర్వకంగా, తీయగా మాటలాడుకోవడాలే ఈ మనుషుల్లో కరువై పోయింది. కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడే వారిని చూసి కనీసం కన్నీటి బొట్లయినా రాల్చరు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన వారికి ఓదార్పు మాటలతో కాస్తంత ఉపశమనాన్ని కూడా కలిగించరు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ ఈ మనుష్యుల మనసులను మార్చే ప్రయత్నం నీవే చేయాలి ప్రభూ!
తే.గీ. లేదు లేదని వాపోవ లేదు ఫలము
దేవుడిచ్చిన దానితోఁ దృప్తిఁ గాంచ
కన్నుఁ గుమిలి కృశింతురే ! సున్న ఫలము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటి సమాజంలో ఎంత ఉన్నా లేదు లేదంటూ ఏడ్చేవారే మనకు ఎక్కువగా తారసపడుతుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం లేదు. మరికొంతమంది విషయానికి వస్తే ఉన్నదాంతో సంతృప్తిబడరు. తద్వారా కుమిలి కుమిలి కృంగి కృశించి పోవడం తప్ప ఫలితం శూన్యం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈజనం కళ్లు తెరిపించవయ్య లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262