శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఏల పంతాలు పట్టింపులేల పగలు
సెగలు రగిలింతురేలకో శీఘ్రకోప
తాపములు వీడరేలకో దరికిఁ జేరు
నివియు వీడిన సౌఖ్యాలు నివ్వటల్లు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం: పంతాలు పట్టింపులు దేనికి? పగలు, ప్రతీకారాలుదేనికి? శీఘ్ర కోపతాపాలను విడిచిపెట్టరెందుకు? ఇవన్నీ విడిచి పెట్టిన పక్షంలో సకల సౌఖ్యాలు దరిచేరడమే కాకుండా చక్కగా సమాజం, తద్వారా దేశమంతటా కూడా మంచితదనం సువ్యాప్తి చెందుతుందని ఉషాపద్మినీ ఛాయా సమేతుడవైన ఓ సూర్యదేవా నీవే చాటి చెప్పాలి లోక ప్రభూ!
తే.గీ. కష్టములఁ బడువారిని ఁ గాంచియంత
సాయముంజేయ ఁ బోకున్న సంతసమ్ము
వారిఁ దలచియు నానందపడుట ఘోర
పాపమటులైన శిక్షలు పడకఁ బోవు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం: కష్టాల్లో కూరుకుపోతున్న వారికి సహాయసహకారాలందించక పోయినా సంతోషమే! అలాంటివారిని చూసి సంతోషించడం మాత్రం చెప్పలేనంత మహాపాపం. పాపానికి పూనుకుంటే ఇహపరలోకాలలో తప్పక శిక్షలు పడతాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవే తెలియజెప్పాలి లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262