శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఆ మహానుభావుల సూక్తులాత్మ నిలిపి
యడుగులను వేయ జీవితాల చ్చెరువ
మలుపుఁ దిరుగును సందేహమన్నదేది?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!మహాత్ముల మహితోక్తులను మనసులో నిలుపుకుని ఆచితూచి అడుగులు వేసిన పక్షంలో ఆశ్చర్యం గొలిపే విధంగా జీవితాలు చక్కటి మలుపులు తిరుగుతాయనటంలో సందేహానికి తావేలేదని ఈలోకానికి తెలియజేయుమయ్యా లోకప్రభూ!

తే.గీ. భోగభాగ్యాలు శాశ్వతమా? గణింపఁ
గావుగావవి వాటితోఁ గన్ను మిన్నుఁ
గానకుంటిరి యేలకో? కలిమిబలము
బలము గాదది నిక్కమ్ము దలుప వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: భోగభాగ్యాలు ఎంత మాత్రం శాశ్వతం కావని వాటిని అనుభవిస్తున్నాం కదా అని కన్ను మిన్ను కానకుంటున్నారెందుకో కదా ! కలిమి బలమనేది మాత్రమే బలమని ఎన్నటికీ తలుపరాదని సంపదలు అశాశ్వతమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262