శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ధర్మకంకణ బద్ధులై ధరణి జనులు
స్నేహశీలతతో జీవితాశయాల
నిచట నెరవేర్చుకొనునట్లు నింగినుండి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: భూజనులంతా ధర్మకంకణ ధారులై అనునిత్యం స్నేహసుధలను ఆస్వాదిస్తూ న్యాయ శీలతతో జీవితాశయాలను నెరవేర్చుకునేలా ఆ పై నుండి ఆశీర్వదించుమయ్యా కర్మసాక్షి వైన ఓ సూర్యనారాయణ మూర్తీ!

తే.గీ. మంచితనమది మెఱయుచు మిసిమి మించి
భూజనంబుల హృదయాలఁ బొంగిపొరలి
యమృధారలై సతతమీ యవనినంతఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మెరుగు బంగారాన్ని మించినది మంచితనమే. ఆ మంచితనం అనేది భూజనుల హృదయాలలో పొంగిపొర్లుతూ అమృతధారలై ఈ అవనిని తడుపుతున్న పక్షంలో స్వర్గమే భూమికి దిగి వస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజేయమయ్యా! లోక ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262