శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే గీ కాన్కలను హుండిలోవేసి కడిగికొనగఁ
దలతురే! పాపపంకిలమిలఁ గనంగ
లంచముంగొనడా దేవుడించుకైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎంతోమంది తాము అమితంగా చేసినటువంటి పాపాలనే బురదను శుభ్రంగా కడిగేసుకోవాలనే వెఱ్ఱిభ్రమలో పడి దేవుని హుండీలో ఎనె్నన్నో కానుకలు వేసేస్తుంటారు. దాంతో తాము చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని భావిస్తారు. అలాంటివాళ్లు సమర్పించే కానుకలు గ్రహించి పాపాలను తొలగించడానికి ఆ భగవంతుడు లంచగొండి కాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవే తెలియజెప్పాలి ప్రభూ!
తే.గీ కొండలెక్కగలేమంచుఁ గుమిలిపోక
గుండె గుడులందు దేవునిఁ గొల్వవచ్చుఁ
బుణ్యఫలమించుకైననుఁ బోదు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దూరాన వున్న కొండలెక్కి దైవదర్శనం చేసుకోలేకపోతున్నామే! అని కుమిలిపోకుండా గుండె గుడులలో కొలువుదీరిన దేవుని కొలువవచ్చు. అలా కొలవడంవల్ల లేశమాత్రం కూడా పుణ్యఫలం తగ్గిపోదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజెప్పుమయ్యా ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262