శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. గడ్డిపరకలవొక్కటై కట్టివేయు
మదుపుటేనుగునైనను మదముదగదు
చేరి చలిచీమలొక్కటై క్రూరమైన
సర్పరాజమ్ము నైననుఁ జంపివేయుఁ
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: గడ్డిపరకలన్నీ పెంటిగా ఏర్పడి మదపుటేనుగునైనా కట్టిపడేస్తాయి. చలిచీమలేకమై భయంకర విషసర్పాన్ని చంపి పారేస్తాయి. కాబట్టి బలవంతుడనని గర్వించడం ఎంతమాత్రం మంచిదికాదు. అహంకారం, అజ్ఞానం రెండూ నాశనానికే హేతువులు. ఎవరికినీ అహంకారం తగదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా లోకానికి తెలియజేయము ప్రభూ!

తే.గీ. దైవదర్శన సమయానఁ దతులు వేరు
వేరు ధనికులకునుఁ బేదవారలకునుఁ
దగదు యోచింపఁ బక్షపాతమదియేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతా దైవదర్శనం కోరి వచ్చే భక్తులే అయినపుడు ధర్మ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు అంటూ వేరు వేరు వరుసలలో పంపించడం తగదు కదా. పరమేశుని సృష్టిలో ప్రతి ప్రాణి ఏదొ ఒక ప్రత్యేకతను కలిగే ఉంది. దానిని గుర్తించక తారతమ్యాలు చూడడం అజ్ఞానమే కదా. కనుక పేద, గొప్ప అనే పక్షపాత బుద్ధి కూడదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ లోకానికి తెలియజెప్పుమయ్యా లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262