శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ వ్యసనముల బారిఁబడిపోయి భయముగొల్పు
జీవితంబుల నూహింపరే విచిత్ర
మకట కోల్పోదురే యున్కి; మాట వినిన
మాన్యులుగ మారిపోదురిమ్మహినఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అయ్యో! ఎంత విచిత్రం? వ్యసనాల బారిన పడిపోయి భయంకరమైన జీవితాలను ఏ మాత్రం ఊహించుకోరే! అదే పెద్దలు చెప్పిన మంచి మాటలను ఆచరణలో పెడితే సామాన్యులే అయినా మహనీయులుగా మారిపోతారని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! లోకానికి విశదపరచుమయ్యా!
తే.గీ మోసపోయెడి వారుండ మోసబుచ్చు
వారలుందురు జాగ్రత్తపడగవలయు
మోసపోయినఁ దదుపరి మూల్గుటేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ సమాజంలో మోసపోయేవాళ్లున్నంతకాలం మోసగించేవాళ్లు ఉంటూనే ఉంటారు. అందుకే జాగ్రత్తపడాలి సుమీ! మోసపోయిన తరువాత బాధపడడందేనికి? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం శూన్యమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైన శైలిలో ఈ లోకానికి తెలియజేయుమయ్యా లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262