శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అక్షరార్చన సంస్కరణాభిలాష
లక్ష్యమవ్వంగ సంస్కరణాభిలాష
లక్ష్యమవ్వంగ దీక్షతో రమ్యమైన
బాటఁ బట్టంగ నేర్వంగ వలయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం : - అక్షరం లేకపోతే మనిషిలో సంస్కారం కొరవడుతుంది. సంస్కారం లేకపోతే మనిషీ రెండుకాళ్ల జంతువువలె మారుతాడు. కనుక అంతా అక్షరాస్యులై ఆ సరస్వతీ మాతను అర్చించడం, సమాజాన్ని సంస్కరించాలని కోరుకోవడం లక్ష్యంగా దీక్షా కంకణ ధారులై అందమైన బాట పట్టడటం విధిగా నేర్చుకోవలసిందిగా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకాన్ని చైతన్య వంతం చేయుమయ్యా ప్రభూ!
తే.గీ. వాక్ప్రసూనాలు విరివిగఁ బరిమళించు
నటుల మెలగంగ వలయును కటువుగానుఁ
బల్కి యితరుల మదిగాయపరచనటులఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మాటలతో దేనినైనా సాధించవచ్చు. కోటలనే కూకటి వేళ్లతో సహా పెకిలించనూ వచ్చు. మాటలతో యుద్ధాలు చేయవచ్చు. ఆ మాటలతోనే మనుషుల మధ్య తారతమ్యాలను మటుమాయం చేయనూవచ్చు. కనుక ఎప్పుడూ మాటలను పువ్వులుగా తలవాలి. ఆ మాటలనే పువ్వులు ఎంతగానో సువాసనలు వెదజల్లే విధంగా అంతా నడుచుకోవాలి. అంతే తప్ప పరుషమైన మాటలతో ఇతరుల మనసులను గాయపరచరాదు. అందరూ తీయగా మాట్లాడేవిధంగా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ! నీవే చూడాలి ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262