శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే,గీ. కట్టెదుట యొక మాటయుఁ గాంచ వెనుక
నొక్కమాటయు మాడాడునొకడు సూడ
ముక్కు సూటిగ మాటాడులెక్క నేయఁ
బోడు వెరొకడతగాడెపో హితుండు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈ లోకంలో ఒకడు ఎదురుగుండా ఒకమాదిరిగాను, ఆ వెనుక మరోమాదిరిగాను మాట్లాడుతుంటాడు. ఎదురుగా ఒక మాట ఆ మనిషి వెనుక మరోమాట మాట్లాడుతుంటారు. మరొకడు ఎప్పుడైనా కుండబ్రద్దలు కొట్టినట్లుగా కచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడుతాడు. అలా మాట్లాడేవాడే నిజమైన మనిషి అని, అతడే అందరికీ హితైషి అని, సమాజానికి కూడా కచ్చితంగా మాట్లాడేవాడే హితాన్ని కూరుస్తాడని లోకానికి తెలియజేయుమయ్య లోకబాంధవా!

తే.గీ. మాటలే మహామంత్రాలు మంచిమాట
లవియు నురికించు జీవిత రథములవనిఁ
గావునెల్లరుఁ జెవినిల్లు గట్టుకొనరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: హితవచనాలే వేగవంతంగా ఉరికి వస్తాయి. కాబట్టి అంతా హితవచనాలను ఏకాగ్రతతో శ్రద్ధాసక్తులతో విని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి ప్రబోధించవయ్య ప్రభాకర స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262