శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. లలిత భావాలు రవళింప రమ్యమైన
జీవితాలనుఁ బంపించుకోవలయును
ఆత్మహత్యలకుంబూనుటఘము గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: సుకుమారమైన మంచి మంచి భావాలు చక్కటి సవ్వడులు చేస్తుండగా అంతా తమతమ జీవితాలను పండించుకోవాలి. అంతేకాని ఏవేవో సమస్యలు వచ్చి పడ్డాయని పిరికితనంతో ఆత్మహత్యలకు పూనుకుని చేజేతులా తమ ప్రాణాలను తీసుకోవడం మహాపాపమన్న విషయాన్ని కర్మసాక్షియైన ఓ సూర్యదేవా లోకానికి తెలియజేయవయ్యా లోకబాంధవా!
తే.గీ. మనిషి రూపాన దేవుండు మసలుచుండు
నాదుకొనువా దేవుండుగాద! యిలను
వాని యున్కినిఁగా పాడవలయుసుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: భగవంతుడు మనిషి రూపంలోనే తిరుగుతుంటాడు. అందుకే దైవం మానుష రూపేణా అన్నారు. ఆపదలలో ఆదుకునేవాడే భగవంతుడు. దేవుడు. అలాంటి దైవం యొక్క ఉనికిని కాపాడవలసిన బాధ్యత సహాయం పొందిన వాడిదేనని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! లోకానికి తెలియజెప్పుమయ్యా ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262