శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. స్వచ్ఛ మైనట్టి సౌజన్య భావవీచి
కలిల సర్వత్ర సువ్యాప్తిఁ గాంచవలయు
నందరానంద ముప్పొంగ నాట్యమాడు
నటుల నడుగులు గదుపంగ నలరుఁబృథి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: స్వచ్ఛమైన మంచితనంతో కూడిన భావాలు లోకమంతటా చక్కగా వ్యాపించాలి. జనులంతా ఉప్పొంగిన ఆనందంతో నాట్యం చేసే విధంగా చకచకగా అడుగులు కదిపినపుడే ఈ భూమండలమంతా ఎంతగానో ప్రకాశిస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ప్రబోధించవయ్యా స్వామీ.
తే.గీ. ఆదుకొనఁ బూని యాపదలందు భుజము
దట్టి ధైర్యంబుఁ జెప్పంగఁ దరలివచ్చు
వాడె మనవాడు నిజమైన బంధువతడు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆపదల్లో ఆదుకోదలచి మన భుజం తట్టి ధైర్యం నూరిపోసినవాడే మనవాడు అతడేనిజమైన బంధువని, చెడు దారిలో నడుస్తున్న వానిని చేయ పట్టి ఆపి ఇది అధర్మమార్గం ఇలా పోవద్దు ఇట్లా గనుక నడిస్తే ఆపదలు వాటిల్లుతాయ అని చెప్పి మంచిదారిలో నడిపించే వారే నిజమైన బంధువులని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్యా లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262