శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పుడమిపై సంచరించెడి పుణ్యదేవ
తలు గనంగను స్ర్తిలంచుఁ దలుపవలయు;
వారినిన్ గౌరవించెడి వారియింట
శాంతిసౌఖ్యాల సాఫల్య సారమలరుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ పుణ్యభూమిపై సంచరించే దేవతాంగనలు స్ర్తిలనే భావన కల్గి యుండాలి. అలాంటి పుణ్య దేవతలను గౌరవించే వారి యింట సుఖశాంతులు చోటు చేసుకొంటాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ప్రబోధించవయ్యా స్వామీ.

తే.గీ. ఆడవారన మణిపూసలవి యెఱింగి
వారి పట్లను సభ్యత మెఱయునటుల
నడచుకోవలె లేనిచో నరకమదియు
నిహపరములఁ జూచె దరహరహమ్ముఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మణిపూసల వంటి పుణ్యాంగనలైన ఆడవారిపట్ల సభ్యతా సంస్కారాలుప్రకాశించే విధంగా ప్రవర్తించాలి. అలాకాని పక్షంలో ఇహపరాల్లో అనుక్షణం నరకానే్న చూస్తారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ప్రబోధించవయ్యా స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262