శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఏది కార్యమేదియ కార్యమేమి ఁ దలుపఁ
బోకనిచ్చవచ్చిన రీతిఁ బోవు వారి
పుట్టుకకు నర్థమే లేదు పుణ్యభూమిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఏది చేయదగిన పనో, ఏది చేయకూడని పనో ఏమాత్రం ఆలోచించకుండా తమకు తోచిన విధంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవారి పుట్టుకకు ఈ పుణ్యభూమలో అర్థమేలేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్య!

తే.గీ. పేరుచెడిపోవు పనులేరి కోరి చేతు
లెల్లడల ఁ జూడనెందరో యుల్లమన్న
దదియు వివికసింపకున్న నిర్దయగ మిగిలి
పోదురే పృథ్వి పై నంత భోరుమనరె!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఉన్న కాస్త మంచి పేరు చెడగొట్టుకునే విధంగా చేయకూడదని అకృత్యాలు అంతటా ఎందరో చేస్తున్నారు. ఇట్లా చేసినట్లయతే వారి హృదయం వికసించని పక్షంలో నిర్దయగా ఈ భూమిపై మిగిలిపోతూ భోరున ఏడ్వవలసి వస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262