శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాయమునుఁ గదల్పగఁబోరుకాస్తయైన
నెటులు గరుగును క్రొవ్వులు నేటికాల
మందునంతట స్థూలకాయాలు గాంచ
పొట్టయన్నది రోగాల పుట్టగాద?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: శరీరాన్ని సుఖపెడితే ఆ శరీరం కష్టపెడుతుంది. శరీరాన్నీ కష్టపెడితే అది సుఖపెడుతుంది కదా. నేటికాలంలో చాలామంది శారీరిక శ్రమను ప్రక్కకు పెట్టేసి, ఇంధన సహాయంతో పనిచేసే పరికరాలను ఉపయోగించడానికి అలవాటు పడిపోతున్నారు. ఇట్లా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే కుదరదు కదా. ఎక్కడ చూసినా స్థూలకాయాలే! పొట్టలు రోగాల పుట్టలుగా కనిపిస్తుంటాయి. కర్మసాక్షివైన ఓసూర్యదేవా శరీరానికి కాస్త శ్రమకలిగించడమే మంచిదని నీవైనా చెప్పవయ్య లోకప్రభూ!

తే.గీ. శక్తిలేకున్ననేమి సద్భక్త యున్నఁ
జాళు దేవుని కృపగల్గు శంకయేల?
స్మరణ చాలద? వేయేల సత్క్రతువులు?
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: శక్తి లేకుంటే నేమి? సద్భక్తి యుంటే చాలదా? భక్తి ప్రధానం కానీ శక్తికాదు భక్తి భావంతో భగవన్నామ స్మరణ చేస్తే చాలు. వేయి యజ్ఞాలు దేనికి? భక్తిరసం తొణికిసలాడే వారి పట్ల ఆ దేవుని దయ తప్పక ఉండి తీరుతుందని సంశయింప పనిలేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ అందరికీ నీవైనా ఎరుకపరుచుముస్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262