శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శర్వ సర్వేశ నీకిదె స్వాగతమ్ము
సుఖముగాని నిచటను పవిష్టుడవుగమ్ము
కమలభవ! క్షేమమా! సృష్టిక్రమము దెలుపు
ప్రథమపూజ్య! మార! కుమార! రండు రడు
భద్రమా! సురేంద్ర కుబేర వరుణులార!
అంచు కలవరించెడు శౌరి అభయ మొసగు॥
*
భావం: చిన్ని కృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు. గోపకాంతలు యశోదమ్మ చుట్టూ చేరారు. కృష్ణుని నోటి నుంచి అప్రయత్నంగా ‘పరమేశ్వరా! రమ్ము! బ్రహ్మదేవా! వచ్చి ఆసీనుడవుకమ్ము!విఘ్నేశ్వరా ! మన్మథా! కుమార స్వామీ! రండి రండి మహర్షులారా దేవతలారా! అందరూ రండి. ఆసీనులు కండి!’ అనే మాటలు వెలువడుతున్నాయి. అంటే చిన్ని కృష్ణుడే హరి అనీ, ఆయన వైకుంఠ సభలో అందరినీ ఆహ్వానిస్తూ సభ దీర్చి ఉన్నాడనీ, అట్టి గోపాల బాలుడు మనకందరికీ అభయమొసగు గాక! అని శ్రీమయూరుని ఆకాంక్ష.
*
తే.గీ. పరమ పావని భూదేవి భయములదు
దుష్ట దునుజ సమూహమున్ దునుమాదునికి
నీదు భారమ్ము తగ్గింతుని నిజము నమ్ము
అంచు కలవరించెను శౌరి అభయమొసగు
*
భావం: మరొక రోజు గోపాల బాలుడు నిద్రిస్తూ భూదేవీ! నేను వచ్చేశాను. దుష్ట రాక్షసులందరినీ సంహరించి భూభారం తగ్గిస్తాను’అంటూ భూదేవికి అభయమిచ్చే శౌరి మనకందరికీ అభయమొసగు గాకై అని శ్రీవాసుదేవుడు అనే కవి ఆకాంక్షిస్తున్నాడు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949