శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దాశరథీ గాథ జెప్పుచు తల్లియగు య
శోద ముదముతో వీపుపై సున్నితముగ
చిచ్చి గొట్టుచు నిద్దుర బుచ్చువేళ
రావణుని నామమంతలో రాగ, లక్ష్మ
ణా! త్వరితముగను ధనువునందుకొనుము
దశముఖుని పీచ మణచెద, ధరణి జాత
కు మితిలేని సంతసమును గూర్తునిపుడె
అంచు బల్కెడు గోవిందుడభయమొసగు ॥
భావం: యశోదమ్మ చిన్ని కృష్ణుని నిదుర బుచ్చుతూ ఉంటే రామాయణ గాథ చెబుతూ ఉండగా చిన్నకృష్ణుడు ఉల్కిపడి ‘లక్ష్మణా! ఆ విల్లుఅందుకో ఇపుడే రావణుని సంహరించి సీతను విడిపిస్తాను’అన్నాడు. అంటే బాలకృష్ణుడు పూర్వజన్మను అందులో రామావతార గాధనుగుర్తుతెచ్చుకుంటున్నాడన్నమాట. ఆ గోవిందు మనలను రక్షించుగాక!
ఆ. వె. వంశగౌరవమ్ము పాండితీగరిమమ్ము
స్వర్ణవైభవమ్ము భవన చయము
మదిని ఆవరించి మదము గూర్పగలేవు
హృదయ సీమలోన కృష్ణుడున్న
భావం: వంశం యొక్క కీర్తి ప్రతిష్టలూ సంపాదించుకున్న పాండితీ వైభవమూ ఇంటినిండా ఉన్న ధనరాశులూ కట్టించుకున్న భవనాల వరుసలూ ఇవేవీ కృష్ణుడు గనుక హృదయంలో నిండి ఉన్నట్లయితే మదాన్ని గర్వాన్నీన కలిగించలేవు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949