శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దివ్యమగు యమనా నదీతీరమందు
నీల మేఘ వర్ణుని కమ్ర నీరజాక్షు
ఘన విశాల వక్షుని బొడగాంచినంత
నాదు హృదయమ్ము నిలువక నలినదళము
పైని, నీటి బిందువు వోలె బరుగుచుండె
నని చెలులతో పలుకు రాధ కనుల మెదలు
మోహనాంగు డౌ కృష్ణుండు బ్రోచు గాక!
భావం: చెలులారా! యమునా నదీతీరంలో నీలమేఘ శ్యాముని ఆజానుబాహువుని అరవింద దళాయ తాక్షుని విశాల వక్షుని చూచినప్పటినుంచీ నా మనస్సు తామరాకు మీది నీటిబొట్టులాగా ఒక చోట నిలవడంలేదు’’ అని పలుకుతున్న రాధమ్మ కనులలో మెదలుతున్న మురళీ కృష్ణుడు మనలను రక్షించుగాక
తే.గీ. తొలుత నల్లని వెనె్నల వెలుగు వచ్చె
వెంట కస్తూరి వాసనల్ వెల్లి విరిసె
ఆ వెనుక వేణు నాదమ్ము లావరించె
కనుల ముంగిట నంత సాక్షాత్కరించె
భవ్య జగదేక లావణ్య వైభవమ్ము

భావం: చల్లని యమునా తీరంలో మొదట నల్లని వెనె్నల వెలుగు ప్రసరించింది. ఆ వెనుక కమ్మని కస్తూరి వాసనలు గుబాళించాయి. అంతలో వేణునాధం మధురంగా చెవులను తాకింది. అంత జగదేక లావణ్య వైభవ మూర్తి ఒకటి నా కనుల ముందు సాక్షాత్కరించింది. అని రాధ తన చెలులతో చెబుతోంది.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949