శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. వె. వంశగౌరవమ్ము పాండితీగరిమమ్ము
స్వర్ణవైభవమ్ము భవన చయము
మదిని ఆవరించి మదము గూర్పగలేవు
హృదయ సీమలోన కృష్ణుడున్న
భావం: వంశం యొక్క కీర్తి ప్రతిష్టలూ సంపాదించుకున్న పాండితీ వైభవమూ ఇంటినిండా ఉన్న ధనరాశులూ కట్టించుకున్న భవనాల వరుసలూ ఇవేవీ కృష్ణుడు గనుక హృదయంలో నిండి ఉన్నట్లయితే మదాన్ని గర్వాన్నీన కలిగించలేవు.
*
తే.గీ. అలిగి వానిపై కోపమ్ము నభినయింప
మొమునటు ద్రిప్పితిని ..వౌనముద్రదాల్చి
తేనె జిల్కు గళమునకు, వాని మధుర
వేణునాదల హరులకు వీనులలరి
కరిగి నీరమై తిని వాని కౌగిటందు
భావం: కృష్ణుని రాక ఆలస్యం కావడం వల్ల వానిపై అలిగి ముఖమునటు వైపు త్రిప్పి వౌనంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఆ మురళీధరుని మధురమైన వేణునాదం చెవిన బడిందో, తేనెల సోనలు చిందేవాని మృదుమధుర కంఠస్వరం చెవినిబడిందో నా అలుక ఎటో ఎగిరిపోయింది. వాని కౌగిట్లో ఒదిగి కరిగి నీరై పోయానే చెలీ! అని అంటోంది రాధ తన చెలులతో.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949