శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. గొంతు గూర్చుని ఘటమును కుదురుగాను
కాళ్ళమధ్యను నిల్పియు కమ్రగదిని
పాలు పితికెడు వేళ గోపాల బాలు
సుందరమ్మగు రూపమానందకరము
పాలధారల సవ్వడి బహురమణము

భావం: ఘటాన్ని కాళ్లమధ్య లో ఉంచుకొని అందంగా పాలు పితికేవేళ నంద కిశోరుని అందం నయనానందకరంగా సృదయాహ్లాదకరంగా ఉంటుంది. ఘటంలో పడే పాలధారల సవ్వడి మరింత రమణీయంగా ఉంటుంది.
తే.గీ. ధరణి మహిత గోవర్థనో ద్ధరణ వేళ
నందునకు యశోదకు జూడ డెందమందు
భయము గల్గెను తొలుత, విస్మయము గలిగె
పిదప, తుదకు కృష్ణుని జూచి ప్రేమ పొంగె
మహిమ గానెంచె రాధమ్మ మనమునందు
గోప బాలురెల్లరు తామె కొండ నెత్తి
నట్లు కేరింతలిడుచు నానందపడిరి
భావం: శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి నెత్తినపుడు నందయశోదలకు ముందుగా భయం కలిగిందట. తరువాత ఆశ్చర్యం వేసింది. నెమ్మదిగా తమ కుమారినిపై ప్రేమ ఉప్పొంగిందట. రాధమ్మ ఇది ఒక దివ్య మహిమగా భావించింది.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949