Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే, ఆ వీథులు దృశ్యశ్రవ్య కావ్యాల్లా భాసిస్తాయి. అక్కడ ఇంటింటా నిత్యాగ్నిహోత్రం. అందుకే ‘స్వాహా’కారాలు తప్ప ‘హాహా’కారాలు వినిపించవక్కడ.
అక్కడ సరస్వతికి గుళ్ళుండవు. ప్రజల నోళ్ళలోనే ఆమెకు కాపురం. లక్ష్మీదేవికి గుళ్ళుండవు. ఆమెకు ఇళ్లన్నీ గుళ్లే. అసలక్కడ ఏ దేవునికీ గుడి ఉండదు. దేవతలంతా ప్రజలై వసిస్తారక్కడ.
అక్కడి చెరసాలలన్నీ ఖాళీగా, బోసిగా ఉంటాయి, నేరస్థులు లేక!
అక్కడ కండలు తిరిగిన యోధులు పొట్టేళ్ళతోనూ, వృషభాలతోనూ, పోటీలకు దిగుతుంటారు యుద్ధాలు లేక!
ఆ ప్రజలు తమ యిళ్ళకు తాళాలన్నవి ఎరుగరు. వారి హృదయాల్లా ఆ వాకిళ్లెప్పుడూ తెరిచే ఉంటాయి.
అక్కడి దారులకిరుప్రక్కలా పూలచెట్లూ, పండ్ల చెట్లూ ఉంటాయి. వాటి పూలూ, పండ్లూ ఐతే చెట్టుమీదా, లేకుంటే భూమీదా ఉంటాయి. పశుపక్షులకు, క్రిమికీటకాలకు ఆహారమవుతుంటాయి. కానీ, వాటిని ఆశించేవాడెవడూ ఉండడు.
ప్రతి ఇల్లూ ఒకతోటే! ప్రతి తోటా ఒక అరణ్యమే!
అందుకే అక్కడ భూమీద కాలూనడానికి కూడా చోటు దొరకదు సూర్యునికి!
వాళ్ళు అప్పులంటే ఏమిటో ఎరుగరు. ఇక వడ్డీ మాట దేముడెరుగు. ఇక ఆ రాజ్యంలో బిచ్చగాడంటూ ఎక్కడా కనిపించడు.
వాళ్ళకి పాడికీ, పంటకీ, ధనధాన్యాలకీ కరువులేదు. అక్కడ ధర్మం కామధేనువులా నాలుగుపాదాలతో సంచరిస్తుంటుంది. సూర్యుడస్తమించినా ఆ అయోధ్యలో వెలుగులస్తమించవు. వాళ్ళకి మరో సూర్యుడున్నాడు. అతడే సూర్యవంశపు రాజైన దశరథ మహారాజు, దశరథాలే కాదు, దశేంద్రియాలూ ఆతని ఆధీనంలో ఉంటాయి.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087