శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అదియె రమ్య బృందావనం బవి యెలతలు
మధుర మధుమాస వైభవంబదియె జూడ
వేటి స్థానంబుల లందవి వెలయుచుండె
కనగ కృష్ణుడిచట లేని కారణమున
అప్పుడున్నట్టి మాధుర్య మిప్పుడేది
భావం: అదే బృందావనం. అదే మధుమాసం. అవేల బాలనికుంజములు. కానీ ఆ మాధుర్యం మాత్రం ఇపుడు లేదు. కారణం నాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. నేడు ఆ కృష్ణుడు బృందావనంలో కాక మధురలో ఉన్నాడు కనక అక్కడ బృందావనం లాగా ఉన్నది. బృందావనం సామాన్యమైన భూమి లాగా ఉన్నది.
తే.గీ. మనము లానంద జలధులై మనుచునుండ
వదన పద్మముల్ వికసించి వరలుచుండ
వాసుదేవుండు నిను జేర వచ్చె ననియు
వ్రజయువతులెల్ల నను జూచి పల్కు టెపుడొ!
భావం: గోపికల ముఖాలు వికసించిన పద్మాల్లాగా వెలిగిపోతుండగా మనస్సుల ఆనంద సంద్రాలై ఉప్పొంగు తూండగా చెప్పేదెప్పుడో కదా! అనుకొంటోందట రాధ బృందావనంలో గోపాలునికై నీరీక్షిస్తూ. గోపాలుని లేని క్షణాలు వారికి యుగాలుగా అనిపిస్తాయ కనుక సదా గోపాలుని ఆలోచనల్లోనో, గోపాలునితోను ఉంటుంటారు వారు.
(శ్రీతైరభుక్త కవి)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949