Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశదిశల్లో అతని కీర్తిరేఖలు విస్తరించాయి.
వాళ్ళకి అతడే తండ్రి, అతడే తల్లి, అతడే దేవుడు.
ఆ రాజుకు కన్నబిడ్డలు లేరు. ప్రజలే అతని కన్నబిడ్డలు.
ఆ రాజునీ, ఆ ప్రజల్నీ వేధిస్తోన్న సమస్య అదే! అదే సంతాన సమస్య!
వారి ఉత్తరాధికారి ఎవరనే సమస్య!
మృగయా వినోదంసూర్యుని రథచక్రమ్ములకేమి అడ్డుతగిలెనో?
ఆగిపోయెనతని రథం ఆకాశం నడుమ.

వినిపించెను ఇంతలోన వీనుల రథఘోష!
చీల్చుకొంచు పశ్చిమమ్ము చిరుమువ్వల సవ్వడి!

ఆ రథమటనే దిగబడె! ఈ రథమెవ్వారిది?
ఆ సూర్యుని మబ్బు గప్పె! ఈ సూర్యుండెవ్వడు?

ఇది ఏమిటి? పట్టపగలె ఈ రథాల ఘోష!
ఒకరికొకరు ఎదురుపడుచు ఇనులిద్దరి వేట?

రథమె కాదు రథము వెంట ఒక తుఫానవోలె
సైన్యమొకటి తరలివచ్చె సాగరమ్మువోలె

వచ్చె! వచ్చె! రథం వచ్చె! భూమియె రథచక్రమనగ!
వచ్చె! వచ్చె! రథం వచ్చె! ఆకసమ్మె ఛత్రమనగ!

క్షణమందే దగ్గరాయె! క్షణమందే దూరమాయె!
అగుపించునొ లేదొ నంత అదృశ్యమ్మాయె!

‘‘రాజు! రాజు! రారాజు! మన రాజే మహారాజు!
ధరణినేలు దశరథుండు! తరలివచ్చె వేటకొరకు!’’
అనుచు అరచినారు ప్రజలు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087