శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. లలిత నవపుష్పమాలికల్ గళములందు
సౌరభమ్ములు విరజిమ్ము సమయమందు
వల్ల వీజన మెల్ల వ్రేపల్లెలోన
వేణు మాధవు రాకకై వేచి వేచి
వేడి నిట్టూర్పులకు విరుల్ వాడిపోయె!
భావం: అందమైన పూల దండలను ధరించి వ్రేపల్లెలలో గోపికలు శ్రీకృష్ణుని రాకకై ఎదురుచూస్తున్నారు. వేణు మాధవుడెంతకూ రాడే. వారి వేడి నిట్టూర్పులకు మెడలో నున్న కోమలములైన పూల దండలు వాడి పోయాయట. గోపికలు మాధవుని రాక కోసం చూచి చూసీ అలసిపోయారట.
తే.గీ. దివ్యవౌ యమునా నదీ తీరమందు
సగము మూసిన కనులతో జగము లేలు
వేణుమాధవు గాధల వినుచు వినుచు
కనగ నాల మందలు పచ్చి గడ్డి మేసి
నెమరు వేయుచు హాయిగ నిలచి యుండ
శ్రీహరి మురళీ నాదముల్ చెవిని బడగ
మోరలెత్తి అంబారవముల సలుపుచు
నీరజాక్షుని కొరకవి నెమకు చుండె
భావం: యమునా తీరంతలో ఆలమందలు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దివ్యలీలా విలాసాలను ఆలకిస్తూ గడ్డిమేసి అర్థనిమీలిత నేత్రాలతో నెమరు వేసుకొంటున్న వేళ , మధురమైన వేణునాదం వినవచ్చింది. అంతే గోవులన్నీ మోరలెత్తి గోపాల బాలునికై వేయి కళ్లతో వెదకటం మొదలెట్టాయట..

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949