శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ప్రియ సఖా! నిన్ను నను వీడి వెడలుమంచు
పలుకలేను, నిల్వుమనుట పాడిగాదు
కాక, నీ యిష్టమని యన్న, కనగనద్ది
నీ యెడ, నుపేక్ష యగును గాకన, నీవు హృదిని
మనలమైత్రిని మాత్రము మరువబోకు!

భావం: కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి ద్వారకలో సందర్శించాడు. కుచేలుణ్ణి కృష్ణుడు అమితంగా గౌరవించాడు. ఇద్దరూ చిన్ననాటి సంగతులను కలబోసుకున్నారు. అప్పుడు కుచేలుడితో శ్రీకృష్ణుడు మిత్రమా! నిన్ను వెళ్లమనడానికి మనసు రావడంలేదు. ఇక్కడే ఉండి పొమ్మనడమూ ధర్మం కాదు. నీ ఇష్టం అనడం నె యెడ ఉదాసీనంగా వ్యవహరించినట్లే అనిపిస్తుంది. కావున నీవు ఎక్కడ ఉన్నా మన స్నేహాన్ని మాత్రం మరవద్దు అని మాత్రమే చెప్పగలను అని వీడ్కోలు పలికాడుకృష్ణుడు (శ్రీహరి)
తే.గీ. సరసి జలపుష్ప హతమైన జలజమట్లు
వామ నయన మదురుచుండె భయములేదు
శాత్రవుల గెల్చి విజయుడై చక్రధరుడు
ద్వారకాపురికి మరలి వచ్చుచుండు
భావం ఎడమ కన్ను చేపతోకతో కొట్టబడిన పద్మంలాగా అదురుతోంది. అంటే శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తున్నట్టు ఉంది

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949