శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అమరేంద్రు గర్వంబు హరియించి వెల్గిన
ధనగోవర్థనోద్ధర్త వీవు
వల్లవీ జనముల వలువలు హరియించి
భాసిల్లు గోపికా భర్త వీవు
క్రౌర్య స్వరూపుడౌ కంసుని ప్రాణముల్
హరియించిన యసుర హర్త వీవు
ఆర్తజనంబుల అఘముల బాపియు కాచిరక్షించెడు కర్త వీవు

తే.గీ. మున్ను వ్రేపల్లె వాడలో వెన్నతిన్న
ముగ్ధ మోహన రసరమ్య మూర్తివీవు
నల్లనేరేడు పండన నడరు నట్టి
నల్లనయ్య నీపదములే నాకు దిక్కు
తాత్పర్యం : అమరేంద్రుని గర్వాన్ని హరియించి గోవర్దన గిరి ధారివి నీవు, గోపికా వల్లభుడవు నీవు, కంసుని మర్దించిన దానవ హర్తవీవు, ఆర్తజనులను కాచి రక్షించే కమనీయ మూర్తివి వీవు. మునుపు వ్రేపల్లె వాడలో వెన్నతిన్నట్టి ముగ్ధ మోహనమూర్తివే నీవు. నల్లనేరేడు పండులాగా మెరిసిపోయే మా పుణ్యపలమైన ఓ నల్లనయ్యా నీపాద పద్మములే నాకు దిక్కు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949