శ్రీకృష్ణ లీలారింఛోళి

శంకరసందర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ఆయన జననమ్మె హైందవేతరమత
శైశిరమ్మునకు వసంత హేల;
ఆయన వచనమ్మె అఖిల దేవమహత్త్వ
తతిచాటు స్తోత్ర రత్నాకరమ్ము
ఆయన వాదమ్మె అన్య పండిత మన
స్సాంద్రాటవులలో హరీంద్ర గర్జ;
ఆయన విజయమ్మ సూయాంధకార ని
స్తబ్ధకర్ణులకు వేదాంతభేరి;
ఆయన ముఖమ్మె బ్రాహ్మీమయమ్ము ; స్వచ్ఛ
భారతీయైక తాత్త్విక సారతరము;
ఆయనయె ‘‘శంకరా’’ఖ్య సంయమి వరుండు;
ఆదిశంకరాచార్య జయంతి నేడు
సీ. భయద సంసారార్ణవమ్మున చిననాడె
పడిపోని త్వదీయ పాండితియును;
సన్న్యసించి యు పుత్ర సహజధర్మమొనర్చి
మాట తప్పని భవనాత్మతృభక్తి
ప్రశ్నించు చండాల నరులోన గురుగాంచు
భవదీయ సమదృష్టి వైభవంబు
ప్రథిత మండన మిశ్ర భారతీవాదమ్ము
విదళించు భవదీయ విజయ లీల
‘‘శంకరోతీతి’’ ‘‘శంకర’’ సంజ్ఞచెల్ల
నవనవాద్వైత పీఠాలు నాల్గు నిలిపి
తత్త్వ సుధ పంచియుజ త్వన్మహత్త్వ గాథ
సంస్తవార్హమ్ము ‘‘శంకరాచార్య’’ వర్య!

రామడుగు వేంకటేశ్వర శర్మ 4866944287