శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. వ్రేపల్లె వాడలో వెన్నమీగడలను
హరియించి పంచిన హస్తమదియె
మానిని రుక్మిణి మనవిని మన్నించి
అభయమ్ము నొసగిన హస్తమదియె
అటుకులంది సఖున కంతులేని సిరుల
నమర జేసినయట్టి హస్తమదియె
పార్థుని రక్షింప పరమాద్భుతంబుగా
అరదంబు నడిపిన హస్త మదియె
తే.గీ. ద్ముదాంధ చక్రమునకు , దుర్నిరీక్ష్య
మైన చక్రమున్ ధరియించు హస్తమదియె
అఖిల శుభముల నందించు హస్త మదియె
అట్టి హస్తంబునకు నేను అంజలింతు
భావం: గోపబాలురకు వెన్నమీగడలు పంచిదీ, రుక్మిణీ దీనారవము విని ప్రాణిగ్రహణానికి పాణిని అంటే చేతిని చాచింది, కుచేలుని అటుకులు అందుకొని అంతులేని సంపదలను ఒసగిందీ, పార్థుని రథానికి సారథి అయి గుర్రాల పగ్గాలను పట్టుకొందీ ఆ కృష్ణయ్య హస్తమే హస్తం.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949